బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలి: ఎమ్మెల్యే
ఉట్నూర్, అక్టోబర్ 6 (ఆంధ్రప్రభ): తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం ఉట్నూర్ డిపోను సందర్శించి.. అక్కడి కార్మికులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న ఆర్టీసీ టి డబ్ల్యూ యు సంఘాన్ని గెలిపిస్తే సంస్థకు మరింత బలం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి కార్మికుడు బాణం గుర్తుకు ఓటు వేసి టి డబ్ల్యూ యు ను గెలిపించాలని కోరారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉట్నూర్ డిపో సెక్రెటరీగా పోటీ చేస్తున్న గబ్బర్ సింగ్ చౌవాన్ బాణం గుర్తుకు ఓటు వేసి.. గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్టీసీ డిపో నుండి సెక్రటరీగా పోటీ చేస్తున్న జవాన్ గబ్బర్ సింగ్, ఆర్టీసీ టి డబ్ల్యూ యు యూనియన్ నాయకులు మెస్రం కేశవ్, శ్రీరామ్, తులసి రామ్, గబ్బర్ సింగ్ , సంగీత, వందన, కార్మికులు పాల్గొన్నారు.
