ప్రజా పాలనకు ఓటేయ్యాలి

ప్రజా పాలనకు ఓటేయ్యాలి

  • ఇందిరమ్మ పాలనలో పల్లెలు సుబిక్షం
  • ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య

రాజాపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ పాలనలో పల్లెలు సుబిక్షంగా ఉన్నాయని ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బాగంగా చల్లూరు, నమిల, బేగంపేట, రేణికుంట, నర్సాపూర్, కాల్వపల్లి, రఘునాథపురం, రాజాపేట గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతోందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవలన్నారు.

గత రెండు సంవత్సరాలుగా పల్లెల్లో, నియోజక వర్గంలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply