vote | బాధ్యతాయుతమైన పాలన అందిస్తా

vote | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : త‌న‌కు ఓటు వేయండి.. బాధ్యతాయుతమైన పాలన అందిస్తానని గుమ్మడి సమ్మయ్య అన్నారు. ఈ రోజు ఆయన ప్రచారంలో ముమ్మ‌రంగా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా స‌మ్మ‌య్య మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేప‌డ‌తాన‌ని, రోడ్లను పునరుద్ధరిస్తానని తెలిపారు. యువత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక తీర్చిదిద్దుతానని ఆయన చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో తాను గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Leave a Reply