Vote | కేంద్ర ప్రభుత్వ నిధులతోనే..

Vote | కేంద్ర ప్రభుత్వ నిధులతోనే..
- గ్రామాల అబివృద్ధి..
- బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్
Vote | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : బీజేపీ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, నర్సింహులపేట బీజేపీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎర్ర వెంకట్రాం నర్సయ్యకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇవాళ నర్సింహులపేట మండల కేంద్రంలో బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొదటగా శ్రీ రాజరాజేశ్వర నవగ్రహ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పిల్లల వైద్యులు కుంభం అశోక్ రెడ్డి మాట్లాడారు. వెంకట్ రాం నర్సయ్యను గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వ అధిక నిధులతో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. బీజేపీ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్, మండల ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నితీష్ కుమార్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు నెలకుర్తి సత్యనారాయణ రెడ్డి, సందీప్, సతీష్, ప్రేమ్, నిఖిల్, హరీష్, తదితరులు ఉన్నారు.
