Vote | సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి
- మంథన్ గోడ్ సర్పంచ్ అభ్యర్థి రాజేందర్ గౌడ్
Vote | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపించండి.. గ్రామ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కె.రాజేందర్ గౌడ్ అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ లో ఇవాళ గ్రామంలో తన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి సేవకుడిగా పని చేస్తానన్నారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. స్థానిక సమస్యలన్నీంటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజల మద్దతుతోనే అభివృద్ధి సాధిస్తానన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మద్దతుదారులతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణయ్య గౌడ్, గోపాల్ గౌడ్, వెంకటయ్య, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.

