Vote | ఓటు వేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు

Vote | నందిగామ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పరిధిలోని మొదళ్లగూడ గ్రామంలో గల పోలింగ్ కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఆయన కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం, ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యమ‌య్యారు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఇలా కుటుంబంతో కలిసి ఓటు వేయడం ద్వారా ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

Leave a Reply