Vote | ప్రజాసేవే లక్ష్యం…

Vote | ప్రజాసేవే లక్ష్యం…

  • కాంపెల్లి సర్పంచ్ అభ్యర్థి చిన్న హనుమయ్య

Vote | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దట్నూర్ గ్రామంలో విజయ బావుట ఎగుర వేయడానికి కాంపెల్లి చిన్న హనుమయ్య సిద్ధంగా ఉన్నారు. తన అన్న హనుమాన్లు సర్పంచ్ గా, ఎంపీపీగా చేసిన అనుభవంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతారని తెలిపారు. ఉన్న సమయంలో గ్రామానికి మంథని నుండి విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో పాటు మంచినీటి సౌకర్యం గోదావరి తీరం నుండి ఏర్పాటు చేసిన విషయాన్ని విజయలక్ష్మి భర్త కొండా శంకర్ మంథని ఎంపీపీగా ఉన్న గత ఐదు సంవత్సరాల సమయంలో విలోచవరం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు.

గ్రామంలోని అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఈసందర్భంగా సర్పంచ్ అభ్యర్థి చిన్న హనుమయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజల మద్దతుతో తాను సర్పంచ్ గా బరిలో ఉన్నానని, సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలందరూ తనకు అండగా ఉండి ఉంగరం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రజాసేవే నా లక్ష్యమని, ప్రజలే నా బలం.. అభివృద్ధే నా ధ్యేయంగా గ్రామస్తుల అందరి సమస్యల పరిష్కారం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply