జోరు వానలోనే అమ్మవారి ఆలయానికి సిరిమాను
ఆర్నబ్ తుపాను ప్రభావంతో ముందుగానే తరలింపు
విజయనగరం, ఆంధ్రప్రభ : ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ శ్రీ పైడితల్లమ్మ సిరిమాను జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సంప్రదాయం ప్రకారం స్థానిక హుకుంపేటలో సిద్ధం చేసిన సిరిమానును తుపాను కారణంగా మధ్యాహ్నం 12 గంటలకే అమ్మవారి ఆలయానికి తరలించారు.
సిరిమాను, రథం ముందుకు కదిలేందుకు అవసరమైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు వేగవంతం చేశారు. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి సిరిమాను ఆలయానికి చేరుకునే అవకాశం ఉండగా, తుపాను ప్రభావం నేపథ్యంలో వేడుకలను త్వరగా ప్రారంభించి ముగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
