పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
విజయనగరం, ఆంధ్రప్రభ : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు మరో వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామిని ఆదేశించారు.
