Viswak sen l ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?

Viswak sen l ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?
బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన విశ్వక్ సేన్
వరుస ఫ్లాపులతో వెనకబడ్డ కెరీర్
ఫంకీ మూవీపై ఆశలు… బాక్సాఫీస్ వద్ద నిరాశ
కథల ఎంపికలో తప్పిదాలే కారణమా?
ఈ నగరానికి ఏమైంది 2పై భారీ అంచనాలు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విశ్వక్ సేన్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో హీరో అయ్యాడు. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే.. ఈమధ్య వరుసగా ఫ్లాపులు ఇస్తూ.. కెరీర్ లో బాగా వెనకబడ్డాడు. ఇటీవల రిలీజైన ఫంకీ అయినా బ్లాక్ బస్టర్ ఇస్తుంది అనుకుంటే.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో విశ్వక్ సేన్ ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి. అసలు విశ్వక్ వరుస ప్లాపులకు కారణం ఏంటి..?
Viswak sen l ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా..

ఇండస్ట్రీలో ఏ చిన్న అవకాశం రావాలన్నా రాసి పెట్టి ఉండాలి అంటారు. అలాంటిది హీరోగా అవకాశం రావడం.. సక్సెస్ ఫుల్ మూవీస్ చేయడం.. అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విశ్వక్ సేన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా విజయం సాధించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు ఉన్నారు. అయితే.. కెరీర్ ను జాగ్రత్తగా మలుచుకుని ముందుకు వెళుతున్నారు. విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అసలు ఆ సినిమా వచ్చినట్టే ఎవరికీ గుర్తులేదు.
Viswak sen l కాలం కలిసి రావడం లేదు..

వెళ్లిపోమాకే తర్వాత ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. హిట్, అశోకవనంలో అర్జున కళ్యాణం, గామి చిత్రాలతో కొత్తదనం చూపించాడు.. చాలా మంచి పేరు సంపాదించాడు. కానీ రెండేళ్లుగా అతడికి ఏమాత్రం కలిసి రావడం లేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో ఫంకీ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. జాతరత్నాలు సినిమాలా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతాది అనుకుని ఈ సినిమా చేసారనుకుంటా.. ప్లాన్ ఏమాత్రం పలించలేదు. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది.
Viswak sen l ఆ రెండు సినిమాలపైనే ఆశలు..

విశ్వక్ ప్లాపులకి కారణం.. సరైన కథలు ఎంచుకోకపోవడమే అంటున్నారు సినీ పండితులు. కెరీర్ ప్రారంభంలో అతను చేసిన సినిమాలు ఏంటి..? ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి..? అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక నుంచైనా విశ్వక్ సరైన కథాబలం ఉన్న సినిమాలు చేస్తే.. మళ్లీ ఆడియన్స్ ని ఆకట్టుకుని సక్సెస్ సాధించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విశ్వక్ చేతిలో ఈ నగరానికి ఏమైంది 2, కల్ట్ సినిమాలు ఉన్నాయి. మరి.. ఈ రెండు సినిమాలు అయినా విశ్వక్ కి విజయాన్ని అందిస్తాయో లేదో చూడాలి.

