Visiting | జలధీశ్వరునికి పూజలు
ఆలయాన్ని దర్శించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కుటుంబ సభ్యులు
Visiting | ఘంటసాల, ఆంధ్రప్రభ : జగ్గయ్య పేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య సతీమణి శ్రీదేవి, కుమారుడు కృష్ణ పవన్, శ్రీదేవి తల్లితండ్రులు చింతా వెంకట జనార్ధనరావు, విశాలాక్షి దంపతులు ఘంటసాల శ్రీ బాలపార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. గతంలో ఈ ఊరికి వచ్చినపుడు ఈ దేవాలయ విశిష్టత తెలుసుకున్నామని, ఈ రోజు ఈశ్వరుని ప్రియమైన ఆరుద్ర నక్షత్ర విశిష్ఠ ననుసరించి ఈ దేవాలయ దర్శనం చేసుకున్నామని ఎమ్మెల్యే శ్రీ రామ్ తాతయ్య సతీమణి శ్రీదేవి చెప్పారు. అనంతరం కృష్ణాజిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ దేవాలయం తరపున వీరికి శేష వస్త్రాలు అందజేసి, స్వామివార్ల చిత్రపటాలు అందించారు. ఆలయ అర్చకులు చావలి కృష్ణకిశోర్ విశేష పూజలు నిర్వహించి ఆశీస్సులు అందించారు.

