Visited | జగన్మాతను దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు..

Visited | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ వారిని మారిషస్ దేశాధ్యక్షుడు ధర్మబ్బీర్ గోకుల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కనకదుర్గమ్మ వారి దర్శనానికి ఇవాళ‌ ఇంద్రకీలాద్రి విచ్చేసిన ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ కే రామచంద్ర మోహన్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

Visited

అమ్మవారి ఆలయానికి వచ్చిన విదేశీ అతిథులను ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతంతో అమ్మవారి ఆలయంలోకి తీసుకువెళ్లగా.. మారిషస్ దేశాధ్యక్షుడు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం దేవస్థానం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనా నాయక్ లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ‌శాఖ అధికారులు, దుర్గగుడి అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు.

Leave a Reply