చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

చింతకాని వాగులో విష్ణుమూర్తి విగ్రహం లభ్యం

కాటారం,ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ సమీపంలో గల వాగులో పురాతన విష్ణుమూర్తి విగ్రహం లభ్యమయింది. వాగు నుండి వివిధ అవసరాల కోసం ఇసుకను తోడుతున్న క్రమంలో నీటి ప్రవాహానికి బయటకు వచ్చింది. వాగులో కొంతమేరకు విగ్రహం కనిపించడంతో గ్రామస్తులు జెసిపి సహాయంతో బయటకు తీశారు.

పురాతన కాలానికి సంబంధించిన విగ్రహం ఆదివారం బాగు నుండి బయటకు తీశారు. దీంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి విష్ణుమూర్తి విగ్రహానికి పూజలు చేశారు. ఇప్పటికే కాని గ్రామంలో గూడెపు చెరువులో లభ్యమైన చెన్నకేశవ స్వామి ప్రత్యేకంగా గుడి నిర్మించి మండల ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోనే కొన్ని చోట్లనే ఉన్న చెన్నకేశవస్వామి చింతకానిలో కొలువవడం, మరో విగ్రహం నేడు బయటపడడంతో ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply