సాయి ధన్సికతో విశాల్ నిశ్చితార్థం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ప్రేయసి సాయి ధన్సికతో కోలీవుడ్ హీరో విశాల్ (Kollywood hero Vishal) నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. చెన్నైలోని విశాల్ నివాసం(Vishal’s residence in Chennai)లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మ‌ధ్య ఈ వేడుక జ‌రిగింది. గత మే నెలలోనే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని విశాల్, ధన్సిక అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి, విశాల్ పుట్టినరోజైన ఈరోజే వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే, విశాల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నడిగర్ సంఘం (Nadigar Sangam) (తమిళ నటీనటుల సంఘం) భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.

ఇక నటి సాయి ధన్సిక విషయానికొస్తే, జూనియర్ ఆర్టిస్ట్ (Junior Artist)గా కెరీర్ ప్రారంభించి తన ప్రతిభతో ఎదిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్ (superstar Rajinikanth) నటించిన ‘కబాలి’ చిత్రం (Kabali movie)లో ఆయన కూతురి పాత్రలో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళం(Tamil)తో పాటు తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లో బిజీగా ఉండగా, త్వరలోనే వీరి పెళ్లి తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply