గో సంరక్షణకు రూ.2 లక్షల విరాళం
విశాఖపట్నానికి చెందిన దంపతుల దాతృత్వం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహిస్తున్న గో సంరక్షణ పథకానికి విశాఖపట్నానికి చెందిన దంపతులు రూ.2 లక్షల విరాళం అందజేశారు. విశాఖపట్నానికి చెందిన సతీష్ కుమార్ నారాయణశెట్టి, అనిత నారాయణశెట్టి దంపతులు గురువారం ఈ మొత్తాన్ని దేవస్థానానికి సమర్పించారు.
ఆలయ అధికారుల సమక్షంలో విరాళానికి సంబంధించిన బాండ్‌ను దాతలకు అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. పూజల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
