బెల్లంపల్లి, మంచిర్యాలలో హాల్ట్..
12, 13 తేదీల్లో సికింద్రాబాద్–కాగజ్‌నగర్–హైదరాబాద్ మధ్య సర్వీసులు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: వినాయక చవితి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక అన్‌రిజర్వ్‌డ్ (జనసాధారణ్) రైళ్లను నడపనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్ కాగజ్‌నగర్–హైదరాబాద్ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. అన్ని కోచ్‌లు సాధారణ సెకండ్ క్లాస్ (అన్‌రిజర్వ్‌డ్) కావడంతో ముందస్తు రిజర్వేషన్ అవసరం లేకుండా సాధారణ కౌంటర్ టికెట్లతో ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు బెల్లంపల్లి, మంచిర్యాల స్టేషన్లలో హాల్ట్ కల్పించారు.
సికింద్రాబాద్–కాగజ్‌నగర్ (07235)..
సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12:10 గంటలకు బయలుదేరే రైలు చర్లపల్లి, భువనగిరి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం మీదుగా మంచిర్యాలకు సాయంత్రం 4:11 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 4:12 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు బెల్లంపల్లికి చేరుకుని 4:31 గంటలకు బయలుదేరుతుంది. ఆసిఫాబాద్ రోడ్ మీదుగా సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది.
కాగజ్‌నగర్–హైదరాబాద్ (07236)..
తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరే రైలు ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట, జనగాం, భువనగిరి, చర్లపల్లి, సికింద్రాబాద్ మీదుగా రాత్రి 11:15 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్‌కు చేరుకుంటుంది. రాజధాని ప్రాంతం నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
