కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన వినయ్‌రెడ్డి

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
నిర్మల్‌ టౌన్‌, ఆంధ్రప్రభ:
నిర్మల్‌కు చెందిన యువ నాయకుడు నల్ల వినయ్‌రెడ్డి గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

కేటీఆర్‌ స్వయంగా పార్టీ కండువా కప్పి వినయ్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి యువ నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రామ్‌కిషన్‌రెడ్డి, ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాన్సన్‌ నాయక్‌, మారుగొండ రాము, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.