ఓ చిన్నారి పరిస్థితి విషమం

ఉరవకొండలో కలవరం
ఆంధ్రప్రభ, ఉరవకొండ రూరల్ ( అనంతపురం జిల్లా) : అనంతపురం (Anantapur) జిల్లా ఉరవకొండ పట్టణంలో ఊరకుక్కలు రెచ్చిపోయాయి. ఓ చిన్నారిపై దాడి చేశాయి. ఈ వీధి శునకాల (Dogs) స్వైర విహారంతో భీతావహ స్థితి ఏర్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉరవ కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన భూమేష్, అతని మేనమామతో కలిసి ఆడుతుండగా.. ఒక్కసారిగా చిన్నారిపై వీధి కుక్కల దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారికి తీవ్రంగా గాయపడగా ఉరవకొండ (Uravakonda) ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో ఆ చిన్నారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
