లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న విక్కుర్తి రాంబాబు
మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలోని బ్రాహ్మణ బజారులో ఏర్పాటు చేసిన వినాయకుని పందిరిలో ఆదివారం లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు సోదరుడు విక్కుర్తి రాంబాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు విక్కుర్తి రాంబాబును ఘనంగా సత్కరించారు.
