Vikarabad | గ్రామీణ స్వదేశీ మేళా..

Vikarabad | గ్రామీణ స్వదేశీ మేళా..
Vikarabad, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి రోడ్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా గ్రామీణం స్వదేశీ ఉత్పల ఉత్పత్తుల మేళాను వ్యవస్థాపకులు విష్ణు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు స్వదేశీ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా తమ సంస్థ కొనసాగుతుందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
