vikarabad | విచికా రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడి
vikarabad |విచికా రిసార్ట్‌పై పోలీసుల ఆకస్మిక దాడి
vikarabad |వికారాబాద్, ఆంధ్రప్రభ : గాంధీ జయంతి సందర్భంగా మద్యం, మాంసాహార విక్రయాలు, వినియోగం నిషేధం ఉన్న నేపథ్యంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వికారాబాద్ జిల్లాలోని గోధుమగూడలో ఉన్న విచికా రిసార్ట్‌పై పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడి చేశారు.
శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వికారాబాద్ టౌన్ పోలీసులు రిసార్ట్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు, మద్యం సేవించడం, మాంసాహారం విక్రయించడం, వినియోగించడం నిషేధం ఉన్నప్పటికీ రిసార్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.
ఉన్నతాధికారుల సమాచారం మేరకు పోలీసులు రిసార్ట్‌లో తనిఖీలు నిర్వహించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎంతమంది పట్టుబడ్డారు? ఏమైనా నిషేధిత పదార్థాలు లభించాయా? అనే వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల ప్రకటన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
