వైభవంగా ‘విజయవాడ ఉత్సవ్’
దసరా వేళ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట
ఉత్సవాల బుక్లెట్ను సీఎం చంద్రబాబుకు చూపించిన ఎంపీ చిన్ని
ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని సీఎం సూచన
ఏపీ , విజయవాడ ప్రత్యేకతలు ప్రతిబింబించాలని ఆదేశం
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం
(విజయవాడ, ఆంధ్రప్రభ) : దసరా సందర్భంగా నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రిని కలిసి ఉత్సవాల కోసం రూపొందించిన బుక్లెట్ను చూపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ నగర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఎంపీ చిన్నికి సూచించారు. ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేస్తూ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. దసరా వేళ విజయవాడ ప్రత్యేకతను చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

