Vijayawada | పార్కులకు పునర్జీవం..

Vijayawada | పార్కులకు పునర్జీవం..

  • గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం
  • సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ
  • ఎల్బీఎస్ నగర్‌లో ఆధునిక పార్క్‌ ప్రారంభం

Vijayawada | పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ లాల్ బహుదూర్ శాస్త్రి నగర్ దివ్యాంగుల హాస్టల్ వద్ద విజయవాడ నగరపాలక సంస్థ సుమారు 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఉద్యానవనం పార్క్‌ను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు శనివారం ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో గతంలో నిర్లక్ష్యానికి గురైన ఓపెన్ ప్లేసులు, పార్కులను పూర్తిగా ఆధునీకరించి ప్రజల వినియోగంలోకి తీసుకువస్తున్నామన్నారు. ఎంత ఖర్చైనా పరవాలేదు పార్కులను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

సుమారు రూ.43 లక్షల వ్యయంతో….

62వ డివిజన్, ఎల్బీఎస్ నగర్‌లోని పార్క్ గతంలో చెత్త, దుర్వాసనతో నిండి ఉపయోగం లేకుండా ఉండేదని, ఎన్నికల సమయంలో స్థానికులు ఈ పార్కును అభివృద్ధి చేయాలని తనను కోరారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన‌ తర్వాత సుమారు రూ. 43 లక్షల వ్యయంతో ఈ పార్కును పూర్తిగా ఆధునీకరించామని ఎమ్మెల్యే బొండా ఉమా పేర్కొన్నారు. ఈ పార్క్ అభివృద్ధితో పిల్లలు రోడ్లపై ఆడకుండా సురక్షితమైన ప్లే ఏరియాలో ఆడుకునే అవకాశం కల్పించామని, మహిళలు, యువత కోసం ఆధునిక జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేశామని, అలాగే సీనియర్ సిటిజన్లు నడక చేయడానికి అనుకూలంగా సాండ్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడితలసి,ఇంచార్జ్ పైడి శ్రీను, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, ప్రధాన కార్యదర్శి మరియ బాబు, తదితర డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply