Vijay names fan baby | “యాజ్ నిల” పేరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ఓ చిన్నారి నామకరణ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దళపతి విజయ్ నేడు చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం పర్యటనలో ఉండగా ఓ అభిమాని తన కూతురికి పేరు పెట్టాలని కోరగా పాపకు స్వయంగా “యాజ్ నిల” (Yaazhnila) అని పేరు పెట్టి, ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు. విజయ్ ఆ చిన్నారిని ఎంతో మురిపెంగా ఎత్తుకుని ఆశీర్వదిస్తూ నామకరణం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

‘యాజ్ నిల’ అంటే అర్థం..

తమిళ సాంప్రదాయ మూలాలు ఉన్న “యాజ్ నిల” అనే పేరు అర్ధం.. ‘యాజ్’ అంటే ప్రాచీన తమిళ సాహిత్యంలో వీణ వంటి అత్యంత మధురమైన తీగ సంగీత వాయిద్యం కాగా, ‘నిల’ అంటే వెన్నెల అని అర్థం. సంగీతం లాంటి మధుర స్వభావం, వెన్నెల లాంటి చల్లని కాంతి సమ్మేళనంగా ఉన్న ఈ పేరును విజయ్ ఎంపిక చేయడంతో అభిమానులు, నెటిజన్లు ఆ పేరులోని విశేషాన్ని కొనియాడుతున్నారు.

విజయ్ చేతుల మీదుగా నామకరణం జరగడం ఆ కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే అపురూప జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ చిన్నారిని ఎత్తుకుని దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తుండటంతో, అభిమానులు, నెటిజన్లు ఆ పాపకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.