హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సారథి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదేండ్ల పాలనలో చంటి బిడ్డ నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ సంక్షేమ ఫలాలు అందుకున్నారు. అన్నం పెట్టే రైతన్న నుంచి మొదలుకుంటే ప్రగతిని పరుగులు పెట్టించే పారిశ్రామికవేత్తల వరకు అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పించి, అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అనవసరంగా కాంగ్రెస్‌ను గెలిపించామని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను యాది చేసుకుంటున్నారు. చేజేతులారా.. కేసీఆర్‌ను ఓడగొట్టుకున్నామని రైతులు, కార్మికులు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఓ పాట అందర్నీ ఆలోచింపజేస్తుంది. కేసీఆర్ బాపును వదులుకున్నాం.. కరువును కళ్లారా చూస్తున్నాం.. అనే పాట అందరి హృదయాలను కదిలిస్తోంది. మరి ఆ పాటను మీరు కూడా ఒకసారి వినండి..