Monday, November 18, 2024

Viral Video | అమ్మ కోసం చెఫ్‌గా మారిన రాహుల్ గాంధీ..

నిత్యం దేశ రాజకీయాల్లో తలమునకలై ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. ఆమె కొడుకు ఎంపీ రాహుల్ గాంధీ.. నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ తమ వంటగదిలో సంద‌డి చేశారు. కొత్త సంవత్సర ప్రారంభవేళ ఇంట్లో ఫ్రెష్‌గా పండిన నారింజ పండ్లతో త‌న తల్లి కోసం ‘ఆరెంజ్ మార్మలాడ్’ రెసిపీని తయారు చేశారు రాహుల్ గాంధీ.

కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వయంగా ప్రిపేర్ చేసిన ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వంటకాన్ని తయారుచేసే 5 నిమిషాల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఈ ఆరెంజ్ మార్మాలాడ్ మా అమ్మకు ఇష్టమైన జామ్.. ఇది మా సోదరి ప్రియాంక నుంచి నేర్చుకున్నాను అని రాహుల్ తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement