ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి తీసుకురావాలి…

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి తీసుకురావాలి…
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియ అంశం పై ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఆదోని, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో నెమ్మదిగా సాగుతోందని, వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు.
సంబంధిత నియోజకవర్గాల తహసిల్దార్ లు, బిఎల్ఓ లతో సమావేశం నిర్వహించుకుని మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు. ఆలూరు, కోడుమూరు లాంటి నియోజకవర్గాలు మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి బాగా తీసుకొని వచ్చారని, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా పురోగతి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
అదే విధంగా క్లెయిమ్స్, డెమోగ్రాఫిక్ కరెక్షన్ కి సంబంధించిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.
