victory | గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం….
victory | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కాశ వేణి తిరుపతి యాదవ్(Kasha Veni Tirupati Yadav) క్కసారి అవకాశం కల్పిస్తే ఉడుంపూర్, జీపీ పరిధిలోని గ్రామాలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
గడప గడపకు ప్రచారం చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ(majority)తో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో తిరుపతి యాదవ్, గ్రామ ఓటర్లు, యువకులు అడుగడుగునా నీరాజనం పలుకుతూ విజయం(victory) నీదేనంటూ దీవెనలు ఇస్తున్నారు.
బీసీ వర్గానికి చెందిన తిరుపతి యాదవ్ విద్యావంతుడు, యువ నాయకుడు గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉందని సర్పంచ్ గా తనను గెలిపిస్తే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, గ్రామంలో మురికి కాల్వల, సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఉడుంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.

