విజేతకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రాక్టికల్ పరీక్షలు

రసాయన శాస్త్రంలో 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు..
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు బుధవారం రసాయన శాస్త్ర ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.

ఉన్నతాధికారుల సూచనల మేరకు విద్యార్థులకు రసాయన శాస్త్ర పరీక్షలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని రమాదేవి స్పష్టం చేశారు.