10వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం రోజున పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన నిమిత్తం వెలిశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొట్టె ప్రసాద్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి వివిధ పాఠ్యాంశాల పరీక్షా అంశాలను, రాతాంశాలను క్రమమైన పద్ధతిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల పరిశీలన తదనంతరము చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు గణనీయమైన మార్కులు సాధించుటకు గాను ఉపాధ్యాయులు చేయవలసిన కార్యక్రమాల గురించి సముచితమైన రీతిలో తగు సూచనలు చేశారు.అదేవిధంగా జిల్లా స్థాయిలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి జిల్లాకు మరియు మీ పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు హితోపదేశం చేశారు. ఇటు బృహత్ కార్యక్రమంలో పరిశీలన బృందం ఉపాధ్యాయ సభ్యులు ప్రకాష్ , వరప్రసాద్ , అశోక్ వెంకట్రావుపల్లి ప్రధానోపాధ్యాయులు రమేష్ , రవీందర్ రాజు, భుజేంద్ర చారి, సుధాకర్ , శ్రీధర్ నాగరాజు పాల్గొన్నారు.
