బస్సు ప్రమాదంలో వెంకటమ్మ మృతి

బస్సు ప్రమాదంలో వెంకటమ్మ మృతి

కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ ప్రమాదంలో మరోకరు మృతి చెందారు. తాండూరు పట్టణంకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె వివరాలు ఆలస్యంగా వచ్చాయి. తాండూరు పట్టణం వాల్మీకీనగర్ కు చెందిన ప్రసాద్ భార్య వెంకటమ్మ(22) హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం తాండూరు నుంచి బయల్దేరిన బస్సులో వెంకటమ్మ కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వెంకటమ్మ కూడా మృతి చెందింది. పోస్టు మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని పట్టణంలోని వాల్మీకీనగర్ కు తీసుకవచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

Leave a Reply