Venigandla Ramu | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఆటోనగర్ మూడో లైన్‌లో నిర్వహించిన గార్మి షరీఫ్ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈ రోజు మధ్యాహ్నం పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు మైనారిటీ పెద్దలు స్వాగతం పలికి, ముస్లిం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం పవిత్ర జెండాల చెట్టు వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మైనార్టీ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో, దాతృత్వానికి ప్రతీకగా నిర్వహించే గార్మి షరీఫ్ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కుల మతాలకు అతీతంగా 2వేల మందికి గ్యార్మీ విందును నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ మండల అధ్యక్షులు వాసే మురళి, సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్‌రావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రషీద్ బేగ్, టీడీపీ నాయకులు కర్రే వెంకటగిరి, కడియాల గణేష్, మత గురువులు కాజా, గార్మి షరీఫ్ వేడుకల కమిటీ సభ్యులు మక్బూల్, అమీర్, అబ్దుల్ కుర్దిష్, షన్నా, కాజా, నాగుల్లా, మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు.

