భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకున్న 40 వేల మంది.. రూ.25 లక్షల ఆదాయం
వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకలు, వివిధ సేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అంచనా.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు దర్శనం, పూజల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
