Pulivendula | 3 కార్లు, 10 బైక్‌లు దగ్ధం..!
Pulivendula | 3 కార్లు, 10 బైక్‌లు దగ్ధం..!
ట్రాక్టర్‌కూ నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
మంటల్లో పూర్తిగా దగ్ధమైన వాహనాలు
ఎన్నికల పోలింగ్‌కు ముందు ఘటనతో కలకలం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Pulivendula | పులివెందుల, ఆంధ్రప్రభ : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గుర్తుతెలియని దుండగులు పలు వాహనాలకు నిప్పంటించారు. ఈ ఘటనలో మూడు కార్లు, పది బైక్‌లు, ఒక ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
పెట్రోల్ పోసి నిప్పు…
పట్టణంలోని శిల్పారామం సమీపంలో ఉల్లిమల మధుసూదన్‌రెడ్డికి చెందిన తోట వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అక్కడ ఉన్న వాహనాలకు నిప్పంటించినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో మూడు కార్లు, పది ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
పోలీసుల దర్యాప్తు…
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనాలకు నిప్పంటించిన వారెవరు? ఈ ఘటనకు గల కారణాలేంటి? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
