మతసామరస్యాన్ని చాటిన చిన్నారి
కూరగాయలతో వినాయకుడి విగ్రహం
విగ్రహాన్ని తయారు చేసిన ముస్లిం విద్యార్థిని అజీజ..
పలువురి ప్రశంసలు
జన్నారం, ఆంధ్రప్రభ : కూరగాయలతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని అజీజ పలువురి ప్రశంసలు అందుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన అజీజ తల్లిదండ్రుల సహకారంతో కూరగాయలతో వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకోవడంతో పాటు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం విద్యార్థిని అజీజతో పాటు ఆమె తల్లిదండ్రులను పాఠశాల చైర్మన్ అమరగొండ సతీష్‌గౌడ్, ఇన్‌చార్జీలు తిరుపతి, మహేష్, పలువురు శ్రేయోభిలాషులు అభినందించారు.
