మృతుడు కుటుంబానికి రూ.10లు ఆర్థిక సాయం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తుమ్మగూడ గ్రామానికి చెందిన కొడప జంగు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు. జంగు భార్య యశోదకు శనివారం వెడ్మ ఫౌండేషన్ ద్వారా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఫౌండేషన్ సభ్యుడు మెస్రం నగేష్ అందించారు.
భర్తను కోల్పోయిన యశోద, ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
