నీటి వనరుల పెంపునకు వి.బి.జి. రాంజీ పథకం
గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులకు ప్రాధాన్యత: సర్పంచ్ తిరుమలేష్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వి.బి.జి. రాంజీ పథకం నీటి వనరుల పెంపునకు దోహదపడుతుందని మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. పథకం ద్వారా లభించే ప్రయోజనాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వి.బి.జి. రాంజీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తిరుమలేష్ మాట్లాడుతూ గ్రామంలో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన వివిధ పనులను పథకం ద్వారా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులను చేపడతామని పేర్కొన్నారు. పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ పొందేలా కృషి చేస్తామని అన్నారు. నీటి వనరుల అభివృద్ధితో గ్రామంలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్, సాంకేతిక సహాయకుడు శివ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
