వర్ధన్నపేట సీఐగా సంజీవరావు బాధ్యతల స్వీకరణ
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం..
ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడి
రాయపర్తి, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సంజీవరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పోలీసు సేవలు అందిస్తామని తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సీఐ సంజీవరావు కోరారు. ప్రజలు తెలియజేసే సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
