కనకదుర్గమ్మ కు విలువైన కానుకలు..

- మొదటిరోజు హుండీ లెక్కింపులో రూ.1.28 కోట్ల ఆదాయం..
ఆంధ్రప్రభ విజయవాడ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి భవానీ లు పెద్ద ఎత్తున కానుకులను సమర్పించుకున్నారు.
ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించిన భవానీ దీక్షల విరమణకు సంబంధించి హుండీల లెక్కింపును అధికారులు మహా మండపం ఆరవ అంతస్తులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించారు.
మొదటిరోజు లెక్కింపుకు సంబంధించి బుధవారం నగదు రూ.1,27,90,645/-, బంగారం 18 గ్రాములు, వెండి కేజీల 2-474- గ్రాములు లభించినట్లు అధికారులు ప్రకటించారు.
ఈవో శీనా నాయక్ దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరగగా పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకర్ బాబు, ఇతర పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
