కలెక్టరేట్‌లో వాల్మీకి జయంతి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మహర్షి వాల్మీకి జయంతిని శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయ (Srikakulam Collector’s Office) సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు (District Revenue Officer M. Venkateswara Rao) పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పురాణ రచయితలను భగవత్ సమానులుగా కొలుస్తారన్నారు. భగవంతుడే వాల్మీకి మహర్షిగాను (బ్రహ్మ), వేదవ్యాసుడు (శ్రీ మహావిష్ణువు) గాను జన్మించి పురాణములను రచించినారని, అవి విశ్వమానవ సౌభ్రాతృత్వమును చాటుతాయని నమ్ముతారని వివరించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు ప్రగడ వెంకన్న మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనురాధ, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఎ.సూర్యనారాయణ, జెడ్పీ సీఈవో డి. సత్యనారాయణ, సెట్విస్ సీఈఓ అప్పలనాయుడు, పీజీఆర్ఎస్ సూపరింటెండెంట్ ప్రవళిక, బీసీ కుల సంఘ నాయకులు ఆంధ్రప్రదేశ్ బొందిలి సంఘం, శ్రీకాకుళం పి. సురేష్ సింగ్, ఘనపతి ఆచారి, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.