పిడుగుపాటుకు రైతు మృతి
వజ్రపుకొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో విషాదం
వజ్రపుకొత్తూరు (పలాస), ఆంధ్రప్రభ : వజ్రపుకొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కర్ని గణేష్ (55) శుక్రవారం పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గణేష్ మృతి పట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
