12వ వార్డులో వాటర్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు

వైరా, ఆంధ్రప్రభ: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సత్రం బజారులో వాసవి కల్యాణ మండపం ఎదుట కొన్ని నెలలుగా రోడ్డు క్రాస్‌ పైప్‌లైన్‌ పగిలిపోయి ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వార్డు కౌన్సిలర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కమిషనర్‌ యుద్ధప్రాతిపదికన స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. పగిలిన పైప్‌లైన్‌ స్థానంలో బుంగను ఏర్పాటు చేయించారు.

మున్సిపాలిటీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలించి పరిష్కరిస్తామని కమిషనర్‌ రామచంద్రరావు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి గజ్జల శ్రీనివాసరావుతో పాటు మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.