పశువులకు టీకాలు..

పశువులకు టీకాలు..

జైనూర్, ఆంధ్రప్రభ : గాలికుంటు వ్యాధి నిర్మూలనకై రైతులు తమ పశువులకు టీకాలను వేయించాలని పశు వైద్య శాఖ అసిస్టెంట్ రాథోడ్ సుకిందర్(Rathod Sukinder) కోరారు. మండల ఇన్చార్జ్ పశువైద్యాధికారి మురళీకృష్ణ(Muralikrishna) ఆదేశాల మేరకు ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పొలాస గ్రామంలో పశు వైద్య శాఖ ద్వారా పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నిరోధిక టీకాల‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రాథోడ్ సికిందర్, పశు వైద్య సిబ్బంది సూర్యకాంత్, మంగీలాల్, ప్రకాష్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply