Uttarakhand | లోయ‌లో ప‌డ్డ వాహ‌నం… 8 మంది మృతి

పిథోరాగఢ్ (ఉత్తరాఖండ్) : పిథోరాగఢ్ లోని మువాని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. పిథోరాగఢ్ లో యాత్రికులను తీసుకెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది యాత్రికులు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన మృతదేహాలను వెలికితీసేందుకు, గాయపడిన వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply