నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ…

నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ…

ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ పురస్కరించుకుని నిరుపేద ముస్లిం సోదరులకు మంజూరు చేసిన రంజాన్ పండుగ తోఫా (దుస్తులు)లను శుక్రవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ ఆధ్వర్యంలో అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం 200 నిరుపేద ముస్లింలకు మంజూరు చేసిన రంజాన్ తోఫాలు పంపిణీ చేయడం జరిగిందని సర్పంచ్ అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మస్రద్ బేగం అన్సారి, అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జై వంతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఏక్బాల్, ఉట్నూరు తాసిల్దార్ కొట్నాక్ రఘునాథ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఉట్నూర్ పంచాయతీ ఈవో శంకర్, వార్డు సభ్యులు నాయకులు ముస్లిం ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply