మహిళకు జాతీయ పురస్కార అవార్డు..

మహిళకు జాతీయ పురస్కార అవార్డు..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదివాసీ మహిళల సాధికారత హక్కులు అటవీ హక్కుల పై నిరంతరం కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ మర్సకొల సరస్వతికి ఆదివారం ఒరిస్సా భువనేశ్వర్ లో మూడు రోజులుగా జరుగుతున్న యాక్షన్ ఎయిడ్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివాసుల జీవన విధానం ఫారెస్ట్ లైలీ వుడ్ కార్యక్రమాలపై జరుగుతున్న జాతీయస్థాయి సమావేశంలో పురస్కారం అందించినట్లు ఆమె భర్త లక్కారం మాజీ సర్పంచ్ మరుసుకోల తిరుపతి తెలిపారు.
భువనేశ్వర్ ఒరిస్సా రాజధానిలో ఫిబ్రవరి 27 28 మార్చ్ ఒకటి మూడు రోజులపాటు జరిగిన జాతీయ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుండి ఆదివాసి మహిళ సరస్వతికి ఆహ్వానించారని ఆమె పనితీరుని చూసి ఆ సంస్థ చైర్మన్ సందీప్ బాబ్రా, ఎస్టర్ సెల్వం నిర్వాహకులు జాతీయ పురస్కార అవార్డు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎవడు రావడం ఎంతో సంతోషంగా ఉందని మరింత పని భార0 బాధ్యతను ఇచ్చిందని మరుసుకోల సరస్వతి తిరుపతి తెలిపారు.
