టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక..

టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక..
రాబోయే తరానికి ప్రమాద సూచిక.
ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం
తపస్ జిల్లా అధ్యక్షులు నరసింహ.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యా వ్యవస్థ బాగుపరచడానికి ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన పరిధిని దాటి ఉపాధ్యాయులకు వేతనాలు అధికంగా ఉన్నాయని వాటిని కోత విధించాలనే సిఫారసులు ప్రస్తుత తరం కన్నా రాబోయే తరానికి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ సిఫారసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తపస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రకరకాల షరతులను అంగీకరించి జ్ఞానవంతులెవరు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ఆసక్తి చూపరని అప్పుడు సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయుల కొరత ఏర్పడి తెలంగాణ విద్యావ్యవస్థ తీవ్ర ప్రమాదం ఎదురుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల వేతనాలు ప్రభుత్వం వేసే వేతన సవరణ సంఘం పెరుగుతున్న ద్రవ్వేల్పనం అనుగుణంగా నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.విద్యా కమిషన్ తన పరిధి దాటి సిఫారసులు చేయడం సమంజసంకాదనిఅన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల విద్యార్హతలను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్ సి టి ఈ.. సబ్జెక్టు విద్యార్హతల విషయంలో ఇప్పటికే వివిధ స్థాయిలకు తగినంత నిర్ణయాలు చేయబడి అమలవుతున్నాయని సూచించారు. వేతనాలు నిర్ణయం చేసే అధికారం ఆయనకు లేదు..ఉద్యోగుల వేతనాలు దేశంలోని ద్రవ్యోల్బణం వారు చదివిన చదువు ఆధారంగా నిర్ణయిస్తారు ..దానికి రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో పిఆర్సి కమిటీ మరియు జాతీయ స్థాయిలో వినియోగదారుల ధరల సూచి ఉందన్నారు. విద్యా కమిషన్ నివేదికలోని అంశాలు అమలు సాధ్యం కాదు. విద్య ఉమ్మడి జాబితా లోని అంశం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు.
