Utkoor | నేటి పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రభ అద్దం లాంటిది

Utkoor | నేటి పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రభ అద్దం లాంటిది

  • ఊట్కూర్ తాసిల్దార్ చింత రవి

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నేటి పోటీ ప్రపంచంలో నూతన ఒరవడితో ఆంధ్రప్రభ దినపత్రిక అద్దంలాంటిదని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ వివిధ రకాల వార్తలు ఎప్పటికప్పుడు అందించేందుకు వెబ్ న్యూస్, వాట్సాప్ ఛానల్, ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్, వెబ్ ద్వారా పాఠకులకు సమాచార అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఊట్కూర్ ఆంధ్రప్రభ సీనియర్ జర్నలిస్టు సందపురం అశోక్ కుమార్ తో కలిసి తాసిల్దార్ చింతరవి, మాజీ జెడ్పిటిసి సూర్యప్రకాశ్ రెడ్డి, బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఊట్కూర్ ఉప సర్పంచ్ రెడ్డినోళ్ల రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎం.భరత్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రప్రభ పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. నిత్య నూతన వాడి వేడి కథనాలతో పాఠకుల మనసు దోచుకుంటున్న ఆంధ్రప్రభ దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రభ పత్రికలో సమగ్ర కథనాలు చదవడం వల్ల ఎంతో తృప్తినిస్తుందని పాఠకుల మదిని దోచుకోవడంలో తనదైన శైలిలో దూసుకు వెళుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపర్డెంట్ కొండన్న, ఏ ఈ వో చరణ్, మత్స్య శాఖ అధ్యక్షుడు వెంకట్ రాములు, నాయకులు వల్లంపల్లి వెంకట్ రాములు, అశోక్, భీమకవిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply