Urea | సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి

Urea | సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలి
- మంచిర్యాల ఏడీఏ కృష్ణ
Urea | జన్నారం, ఆంధ్రప్రభ : రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని మంచిర్యాల ఏడీఏ కృష్ణ తెలిపారు. జన్నారం మండలంలోని చింతగూడ,పొనకల్ సింగల్ విండో సొసైటీ కార్యాలయాలను, మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలను మంగళవారం మధ్యాహ్నం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ తర్వాత చింతగూడ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని,జాతీయ ఆహార భద్రత పథకం కింద వచ్చిన వేప నూనెను రైతులకు ఆయన పంపిణి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూరియా నిల్వలపై నిర్వాహకులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ జీరో కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సొసైటీల కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు కలుగకుండా తమ వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టెక్నికల్ ఏడీ ఏ గోపి, ఇన్చార్జి మండల వ్యవసాయ శాఖ అధికారి గొర్ల అంజిత్ కుమార్, చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత – వినయ్ కుమార్, స్థానిక ఏఈఓ లవన్ కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

