యూరియా సమస్య పరిష్కరించాలి
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : తన నియోజకవర్గంలో ఉన్న యూరియా కొరత తీర్చాలని వ్యవసాయ శాఖ మంత్రి(Minister of Agriculture) తుమ్మల నాగేశ్వరరావుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే(MLA) బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో మంత్రికి ఆయన కలిశారు. యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) స్పందిస్తూ… గురువారం నాటికి యూరియా సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే తెలిపారు.

